పూదోటలో గులాబి పూచింది
అమాయకంగా చిగురించింది
నవ్వుతో వికసించింది
తాకిన చేతినే గాయపర్చింది
పెనుగాలే వచ్చింది
అమాయకత్వాన్నే దోచింది
నవ్వునే విరిచింది
గులాబినే తుంచింది
కొత్త గులాబి విరిసింది
నవ్వు మరిచి అమాయకంగా చిగురిస్తుంది
ఇపుడు వెన్నెలనే కాదంటుంది.
bagundandi me kavitha.
me gulabi kavitha chala bagudhi.so nice of u